AP: 2019లో గెలిచిన తర్వాత.. పార్టీ నిర్మాణంపై వైసీపీ అధినేత జగన్ పెద్దగా దృష్టి పెట్టలేదు. అది 2024 ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించింది. కూటమి అధికారంలో వచ్చింది. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలు పార్టీకి దూరమవుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా.. వైసీపీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. దాంతో పార్టీని బలోపేతం చేయడానికి, తనకు సలహాలు ఇవ్వడానికి జగన్ కొత్తగా సలహాదారుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం.