ప్రమాదమని తెలిసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

5581చూసినవారు
ప్రమాదమని తెలిసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
మర్రిపాడు మండలవ్యాప్తంగా గత నెల రోజులు నుండి కురుస్తున్న భారీ వర్షాలకు పొంగూరు గ్రామంలోని చెరువు నిండుకుండను తలపిస్తూ అలుగు సమీపంలో చెరువులోని నీళ్లు కట్టను పొర్లి ప్రవహిస్తూ ప్రమాదకరంగా ఉంది. ఈ విషయాన్ని గ్రామస్తులు మండల అధికారులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన మండల రెవెన్యూ అధికారులు తహసీల్దార్ అబ్దుల్ హమీద్, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, ఆర్. ఐ సురేంద్ర స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ వెంకట రమణ సోమవారం గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించి గ్రామ పెద్దలతో మాట్లాడారు.

కట్ట పొర్లి దారికి అడ్డంగా ప్రవహిస్తున్న నీళ్లను జేసిబి సహాయంతో కాలువ తీసి ప్రమాదం జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ హమీద్, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, ఆర్. ఐ సురేంద్ర స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ వెంకట రమణ. వారి సిబ్బంది వైసీపీ నాయకులు మండల మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, గ్రామపెద్ద ఉర్లగంటి శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఉన్నారు. తెలిపిన వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిప్రదికన గ్రామ చెరువు ప్రమాదానికి గురికాకుండా ప్రత్నామ్యయా మార్గాన్ని చూపి పనులు నిర్వహించిన మండల అధికారులపై పొంగూరు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్