అంగరంగ వైభవంగా అచ్చమాంబ పేరంటాలతల్లి బ్రహ్మోత్సవాలు

1449చూసినవారు
అంగరంగ వైభవంగా అచ్చమాంబ పేరంటాలతల్లి బ్రహ్మోత్సవాలు
మర్రిపాడు మండలం పొంగూరు, మాలిచేలు గ్రామంలో కొలువైన శ్రీ అచ్చమాంబ పేరంటాలతల్లి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. నేటితో ఉత్సవాలు ముగిసాయి. అమ్మవారికి అర్చకులు విశేష పూజలు జరిపించారు. ఆదివారం చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పించుకున్నారు. పొంగళ్ళను నైవేద్యంగా అమ్మవారికి పెట్టుకున్నారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం అంతా మారుమెుగింది. అనంతరం ఈ బ్రహ్మోత్సవాలలో పక్క జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్