నిర్బంధ గ్రామ ప్రజలకు సొంత ఖర్చులతో నిత్యవసర వస్తువువులు పంపిణీ చేసిన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్టేట్. అబ్దుల్ హమీద్ మరియు డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కేతమన్నేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో పడమటి నాయుడు పల్లి, చుంచులూరు ఎస్. సి కాలనీ వాసులు నిర్బంధంలో ఉండటంతో నిత్యావసర వసతులు లేక ఇబ్బందులతో ఉన్నారని తెలుసుకున్న మర్రిపాడు తహశీల్దార్ అబ్దుల్ హమీద్, డిప్యూటీ తహశీల్దార్ ప్రదీప్ నిత్యవసర వస్తువులు కూరగాయలు ఆటో లో బుధవారం పడమటి నాయుడు పల్లి గ్రామం లోని ఎస్. టి కాలనీ, ఎస్. కాలనీ, చుంచులూరు ఎస్. సి కాలనీ వాసులకు విఆర్వో కలీల్ చేతులు మీదుగా పంచి గ్రామస్తులకు కొంత ఊరట కల్పించారు.
మూడు రోజులు నుంచి కూరగాయలు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆపద సమయంలో కూరగాయలు. పంచి ఆదుకున్న మండల పెద్దలకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.