మర్రిపాడు మండలం పపడమటినాయుడుపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు వైఎస్సార్ రైతు భరోసా చైతన్య యాత్ర మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంబంధించిన పదకాలు వివిధ పంటల యాజమాన్య పద్ధతులు మండల వ్యవసాయ అధికారి రామ్మోహన్ వివరించారు. పంటలలో చీడపీడల వాటి నివారణ గురించి రైతులకు తెలియజేశారు. అలాగే వెటర్నరీ శాఖకు సంబంధించిన పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వ్యవసాయం మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఏఈఓ వెంకటేశ్వర్లు, వి ఏ ఏ ప్రశాంతి, పశుసంవర్ధక సహాయకులు ముజమిల్ పాల్గొన్నారు.