ఉచిత పశు వైద్య శిబిరం

1467చూసినవారు
ఉచిత పశు వైద్య శిబిరం
మర్రిపాడు మండలం లోని నందవరం గ్రామంలో మర్రిపాడు పశు వైద్యాధికారి డాక్టర్‌ గురుజయంతి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పాడి రైతులకు పశు విజ్ఞాన బడి కార్యక్రమం నిర్వహించి, అవగాహనను కల్పించారు. అనంతరం పశువైద్యాధికారి డాక్టర్‌ గురుజయంతి మాట్లాడుతూ.. జాతీయ ఉచిత పశు కృత్రిమ గర్భధారణ పథకం కింద ఎదకు రాని పాడి పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ చికిత్స చేశామన్నారు.

సంవత్సరానికి ఒక దూడ పథకంపై పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద మూడు సార్లు కృత్రిమ గర్భధారణ నిర్వహిస్తామన్నారు. 47 పశువులకు కృత్రిమ గర్భధారణ చికిత్సలు, 84 లేగదూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్