రాష్ట్రంలో నేడు పదవ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులకు పల్లెల నుండి పరీక్ష కేంద్రానికి వెళ్ళడానికి విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత ప్రయాణ రాయితీ కల్పించినట్లు ముందుగానే ప్రకటించింది. కానీ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి బేఖాతరు చేస్తూ ఆత్మకురు డిపోకు చెందిన ఆత్మకురు టూ బద్వేలు బస్సు కండక్టర్ విద్యార్థుల దగ్గర అల్ టిక్కెట్ చూపించినా టిక్కెట్ తప్పని సరి అంటున్నారు. మర్రిపాడు పరీక్ష కేంద్రంలో పరీక్షలు వ్రాస్తూ చుంచులూరు గ్రామంలో బస్సు ఎక్కిన విద్యార్థుల దగ్గర టిక్కెట్ తీసుకోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి విచారించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.