గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చుంచులూరు, పడమటి నాయుడుపల్లి వద్ద కేతా మన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ చుంచులూరు ఎస్సీ కాలనీ, పడమటి నాయుడు పల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వాగును జడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులు నాయుడు సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేతా మన్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడం వలన చుంచులూరు ఎస్సీ కాలనీ, పడమటి నాయుడు పల్లి గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మంత్రి మేకపాటి గౌతం రెడ్డితో మాట్లాడి ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జి ఎత్తు పెంచడానికి కృషి చేస్తామని తెలియజేశారు. వారితో పాటు చుంచులూరు ఎంపీటీసీ నరసారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్బారెడ్డి, విష్ణు కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.