చనిపోయిన వారికి మస్టర్లు వేసి లక్షల్లో నగదు స్వాహా
దుత్తలూరులో మంగళవారం అడిషనల్ ఫీడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ కార్యక్రమం జరిగింది. నందిపాడు, ఎరుకోల్లు నరవాడలో ఉపాధి హామీ పనుల్లో చనిపోయిన వారికి మాస్టర్లు వేసి లక్షల్లో నగదు మింగేసినట్లు వెల్లడయ్యింది. వెంకట రత్నం, రమణయ్య లు చనిపోయిన వారికి మస్టర్లు వేసి నగదు మింగేసినట్లు తెలిపారు. రికార్డులు సరిగా లేకపోవడం, పనిచేయుని వారికి హాజర్లు వేయడం వంటి విషయాలు వెలుగు చూశాయి.