అంగరంగ వైభవంగా గూడూరులో సీఎం ప్రమాణస్వీకార సంబరాలు

1033చూసినవారు
గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వేడుకలా జరిపారు. క్లాక్ సెంటర్లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సీఎం ప్రమాణస్వీకారం దృశ్యాలను తిలకించారు. కూటమి నాయకులు నానాజీ, పులిమి శ్రీనివాసులు, మట్టం శ్రావణి రెడ్డి, సునీల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్