AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 58.358 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.54 కోట్లు సమర్పించారు.