ఉత్తరప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్‌లో జరిగిన ఘటన హృదయాన్ని కదిలించింది. అధికారులు బుల్డోజర్‌తో అక్రమ కట్టడాలను కూల్చుతుంటే ఓ ఏడేళ్ల బాలిక అనన్య పక్కనే ఉన్న గుడిసెలోకి పరిగెత్తింది. ఎగిసిపడే మంటలను పట్టించుకోకుండా చిన్నారి గుడిసెలోకి వెళ్లి స్కూల్ బ్యాగ్‌ను తెచ్చుకుంది. ‘నేను నా బ్యాగును తెచ్చుకోకపోతే నా చదువు ఆగిపోయేది’ అని అనన్య ఆవేదన వ్యక్తం చేసింది.