కందుకూరు నియోజకవర్గంలో 80% పెన్షన్ల పంపిణీ పూర్తి

78చూసినవారు
కందుకూరు నియోజకవర్గంలో 80% పెన్షన్ల పంపిణీ పూర్తి
కందుకూరు పట్టణంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. లబ్ధిదారులకు సచివాలయం సిబ్బంది, స్థానిక టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. కందుకూరితో పాటు గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు మండలాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి జోరుగా జరుగుతుంది. దాదాపు 80 శాతం పెన్షన్ పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్