కందుకూరు పట్టణంలోని శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపం నందు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా రక్తదానం గొప్పది అన్నారు. రక్త దానం చేయటం వల్ల ఆపదలో ఉన్న మరో ప్రాణాన్ని రక్షించే అవకాశం మనకు లభిస్తుందని తెలిపారు.