గత ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంలోని పంచాయితీల్లో జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ని కలెక్టర్ కార్యాలయంలో ఇంటూరి నాగేశ్వరరావు కలిశారు. కందుకూరు నియోజకవర్గంలో గత వైసిపి ప్రభుత్వ హయాంలో కొన్ని పంచాయతీలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. నిందితులను శిక్షించాలని కోరారు.