వైభవంగా రాములోరి కళ్యాణం

61చూసినవారు
అల్లూరు మండలంలోని పురినికొత్తపాలెం శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. గణపతి పూజ, స్వామి అమ్మవార్లకు అభిషేకం, తదుపరి శ్రీ సీతా సమేత కోదండ రామస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్