కావలి: 17 ఎకరాల్లో వేసిన మూడు అక్రమ లేఅవుట్లు తొలగింపు

62చూసినవారు
కావలి: 17 ఎకరాల్లో వేసిన మూడు అక్రమ లేఅవుట్లు తొలగింపు
నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోట పంచాయతీలో 17 ఎకరాల్లో వేసిన మూడు అక్రమ లేఅవుట్లను ఎంపీడీవో శ్రీదేవి సమక్షంలో మంగళవారం తొలగించారు. మాజీ ఏఎంసీ వేసిన లేఅవుట్ లో ఏకంగా రెండు ఎకరాల పంటకాలువ కబ్జా చేసినట్లు గుర్తించారు. దగ్గరుండి రెండు లేఅవుట్లలో రాళ్లు తొలగించి ఎంపీడీవో శ్రీదేవి చర్యలు చేపట్టారు. వలచోట్ల ఉన్న మరికొన్ని అక్రమ లేఅవుట్లను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్