కన్నబిడ్డపై అత్యాచారానికి ఒడి కట్టిన కసాయి తండ్రి

63చూసినవారు
కన్నబిడ్డపై అత్యాచారానికి ఒడి కట్టిన కసాయి తండ్రి
నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఓ దళితవాడలో ఘోరం జరిగింది. అల్లూరు మండలం నార్త్ మోపూరులోని దళితవాడలో కన్న కూతురి పై తండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. కూలి పని చేసుకునే ఓ వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె (12) పై అత్యాచారానికి పాల్పడగా ఆమె కేకలతో విన్న తల్లి కుమార్తెను రక్షించింది. నిందితుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతనిని పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్