కావలి నియోజకవర్గంలోని దగదర్తి అల్లూరు, కావలి, కావలి రూరల్ మండలాల్లో మంగళవారం ఉదయాన్నె పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలయింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో ఆయా ప్రాంతాల్లోని టిడిపి నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. కాగా కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు పనిచేయక పెన్షన్ పంపిణీ ఆలస్యమైంది.