విడవలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం గ్రామపంచాయతీలు అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలో ఎల్ఈడి స్క్రీన్ పై సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.