కోవురు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు వరిణి, దండిగుంట వద్ద ఒకటవ నంబర్ కాలువ వద్ద పూడిక తీత పనులను శుక్రవారం ప్రారంభించారు. విడవలూరు మండలం ఇంచార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల వాసు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ఈ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వరిణి దండిగుంట, రామచంద్రాపురం రామతీర్థం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.