బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కాజా నగర్ లో మొహరం పండుగ సందర్భంగా సోమవారం రాత్రి పీర్ల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళ వాయిద్యాలు, డప్పుల మోతతో కాసేపు ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొన్నది. ప్రత్యేక పుష్పాలతో పీర్లను అందంగా అలంకరించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి ఈ పీర్లను దర్శించుకున్నారు.