విత్తన తయారీ కేంద్రంలో తనిఖీలు

65చూసినవారు
విత్తన తయారీ కేంద్రంలో తనిఖీలు
కొడవలూరు మండలంలోని ఎల్లాయపాలెం మజరా దాసరి పాలెం వద్దగల వరి విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్ ను పొదలకూరు ఏడిఏ శివ నాయక్, విత్తన తనిఖీ బృందం సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ప్లాంట్లులో పలు రిజిస్టర్ లను, విత్తన నిల్వలను తనిఖీ చేశారు. విత్తనాలను కొనుగోలు చేసిన రైతుల సంతకాలను విధిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం ఏవోలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్