తాను ఎక్కడ ఉన్నా ఎప్పుడూ గుర్తు వచ్చేది తన ఊరే అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డైరెక్టర్ కొమరగిరి నందకుమార్ తెలిపారు. మంగళవారం గాంధీ జన సంఘం లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కొడవలూరు మండలం, కొత్త వంగలు పంచాయతీ, గాంధీ జన సంఘం తన స్వగ్రామమని ప్రతి సంవత్సరం సొంత ఊరికి రావడం ఆనవాయితీ అన్నారు. గ్రామంలోని సీతమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.