కోవూరు మండలం పరిధిలో ఇనమడుగు గ్రామంలో గురువారం చోరీ జరిగింది. టెంకాయ తోపు వీధిలో నివాసం ఉంటున్న రాజమ్మ ఇంట్లో చోరీ జరిగింది. యజమానులు ఇంటికి వచ్చేసరికి ఇంట్లోని సామాన్లు మొత్తం చిందరగా పడవేసి ఉండడంతో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో పక్కా ప్రణాళికతో దొంగతనం చేశారని స్థానికులు ఆరోపించారు. దొంగలు ఏం చోరీ చేశారో తెలియాల్సి ఉంది.