కార్యకర్తల త్యాగాల ఫలితంగానే 2024 లో తెలుగుదేశంపార్టీ అధికారంలోనికి వచ్చిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. బుచ్చిరెడ్డి పాళెంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె జిల్లా టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.