Mar 15, 2025, 04:03 IST/
పవన్‌పై ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్
Mar 15, 2025, 04:03 IST
AP: జయకేతనం సభలో ‘హిందీ మన భాషే కదా?’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా ప్రకాశ్ రాజ్ స్పందించారు. ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్‌కు ఎవరైనా చెప్పండి. ప్లీజ్.’ అని అన్నారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. కాగా, ప్రకాశ్ రాజ్, పవన్ మధ్య కొనాళ్లుగా ట్వీట్ వార్ నడుస్తోంది.