Jan 23, 2025, 09:01 IST/
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత చంద్రహాస్ మృతి
Jan 23, 2025, 09:01 IST
ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది. గరియాబంద్ జిల్లా పరిధి మెయిన్‌పురి సరిహద్దు ప్రాంతంలోని కులారి ఘాట్ అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి గిరియాబంద్ డీఆర్జీ, ఒడిశా ఎస్‌వోజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్, CRPF సిబ్బంది సంయుక్తంగా కూబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్ర నేత హైదరాబాద్ కు చెందిన ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ అలియాస్ పాండు మృతి చెందారు. ఈ విషయాన్ని భద్రతా దళాలు అధికారికారికంగా ధృవీకరించాయి.