నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన

63చూసినవారు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి ఓ యువకుడు ఓ ఇంటి ముందు నిలబడి ఆ ఇంట్లోకి పెట్రోల్ ప్యాకెట్లను విసిరి నిప్పంటించాడు. చెముడు గుంట పంచాయతీ నక్కల గిరిజన కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడు ఇంటి ప్రహరీ లోపల పార్క్ చేసిన ఉన్న స్కూటీ వద్దకు పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నిప్పంటించాడు. ఈ ఘటనలో అక్కడే కట్టేసి ఉన్న కుక్క కూడా తగలబడిపోయింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్