వివిధ కేసుల్లో నెల్లూరు సెంటర్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం ఆయన సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. వైసిపి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితోపాటు పలువురు నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు.