నెల్లూరు రూరల్ డిఎస్పి జీ. శ్రీనివాసరావుతో మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మాదిగ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పల్లాల సునీత తదితరులు గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ కొండపల్లిలోని అరుంధతి వాడలో జరిగిన వివాదంలో దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకులూరి శీనయ్య పాల్గొన్నారు.