నెల్లూరులోని 33 వ డివిజన్ గల వెంగళరావు నగర్ లోని స్మశాన వాటిక వద్ద బుధవారం డివిజన్ టిడిపి ఇన్ ఛార్జ్ హజరత్ నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో పరిశుభ్రత పనులను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దలకు నివాళులర్పించేందుకు సమాధుల వద్దకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమాధుల వద్ద ముళ్ళ చెట్లను తొలగించి, శుభ్రం చేయించామన్నారు