నెల్లూరు నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జడ్పీ సీఈవో జె. మోహన్ రావు చేతుల మీదుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పరిపాలన అధికారులు, జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.