ఇటీవల జిల్లా పరిషత్ లో జరిగిన అధికారుల, సిబ్బంది బదిలీలు తమకు తెలియకుండానే చేశారని జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జెడ్పి సీఈవో, డిప్యూటీ సీఈవో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. దీనిపై కోర్టుకు వెళుతున్నట్లు వారు ప్రకటించారు.