జిల్లా వ్యాప్తంగా ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని డిఆర్ఓ లవన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఏపీ టెట్ పరీక్షల నిర్వహణపై సమన్వయ అధికారులతో డిఆర్ఓ లవన్న సమావేశం నిర్వహించారు.