సర్వేపల్లి: తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం

52చూసినవారు
సర్వేపల్లి: తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం
పొదలకూరు వినాయక మాన్యం ఎంపీపీఎస్ స్కూల్ నందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంకిరెడ్డి, శ్రీనివాసులు, పాఠశాల ఛైర్మన్ కొంగి మౌనిక, నాయకులు డేగా హరినారాయణ, సుభాన్, రవి, రామయ్య, ప్రదీప్, శివకుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్