నాయుడుపేటలో ఘనంగా ఆడికృతిక మహోత్సవం

67చూసినవారు
నాయుడుపేట పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ వళ్లీ దేవసేన సమేత కళ్యాణ సంతాన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆడి కృతిక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు చందనాలంకారం చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు చదలవాడ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్