విద్యుత్ స్తంభాన్ని అలుముకున్న పిచ్చి మొక్కలు

55చూసినవారు
విద్యుత్ స్తంభాన్ని అలుముకున్న పిచ్చి మొక్కలు
వరికుంటపాడు మండలంలోని రామదేవులపాడు గ్రామ సమీపంలోని చింతగుంట వాగు పొలాల్లో విద్యుత్ స్తంభాన్ని పిచ్చి మొక్క తీగలు పూర్తిగా అలుముకొని కమ్మేశాయి. ఫలితంగా నేలకు సైతం విద్యుత్తు ఎర్త్ అవుతున్నది. దీంతో పొలం యజమానులు ఆ ప్రాంతానికి వెళ్లాలంటే జంకుతున్నారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి పిచ్చి మొక్క తీగలను తొలగించాలని స్థానికులు బుధవారం మీడియా ముఖంగా కోరారు.

సంబంధిత పోస్ట్