కలిగిరి మండలం పోలంపాడు గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయమును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బుధవారం సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదములు స్వీకరించారు. పోలేరమ్మ అమ్మవారి గుడికి దగ్గరలో ఉన్న పొలంపాడు చెరువు కట్టను, పరిసర ప్రాంతాలను పరిశీలించి అక్కడి సమస్యలను నాయకులను, గ్రామస్తులను అడిగి తెలుసుకొని, త్వరలోనే వాటి పరిష్కారము నకు కృషి చేస్తానని తెలియజేశారు.