వరికుంటపాడు: శెనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం

65చూసినవారు
వరికుంటపాడు: శెనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం
వరికుంటపాడు మండలంలో 1200 ఎకరాలు శనగ సాగు చేయుటకు సిద్ధంగా ఉన్న రైతులు విత్తనాల కొరకు రైతు సేవ కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వి. రవికుమార్ తెలిపారు. శనగ సాగు చేసే రైతులు వారి ఆధార్ జిరాక్స్, పొలం పాస్ పుస్తకం జిరాక్స్ తో రైతు సేవ కేంద్రాలలో నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. విరువురు బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోన్నారు.

సంబంధిత పోస్ట్