ఉదయగిరి మండలం గండిపాలెంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శుక్రవారం నాడు సిద్ధేశ్వర మహా శివలింగమునకు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు దేవాలయానికి విచ్చేసే భక్తులందరి స్వహస్తాలతో తామే స్వయంగా అభిషేకం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగినది. భక్తుల కొరకు దేవస్థానం నందు ఆవు పాలు అందుబాటులో ఉంచునున్నారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని అర్చకులు కోరారు.