ఉదయగిరి నుంచి నందవరం వరకు ఇటీవల రోడ్డుపై తారు పోశారు. అయినా అది ఎక్కువ రోజులు ఉండలేదు. కనీసం రెండు నెలలు కూడా జరగకుండానే తారు మొత్తం లేచిపోయింది. ప్రతిరోజు ఈ మార్గంలో కొన్ని వందల వాహనాలు తిరుగుతుంటాయి. ఈ మార్గంలో జాతియ రహదారి నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రజలు, వాహనదారులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. ముఖ్యంగా చినమాచనూరు, కరటంపాడు సమీపంలో రోడ్డు మరీ దారుణంగా ఉంది.