నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయం పై ఏసీబీ దాడులు వరికుంటపాడు మండలానికి చెందిన లోకసాని వెంగయ్య అనే ఉపాధ్యాయుడు వద్ద నుండి 40 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ టి ఓ సి హెచ్ మమత పట్టుబడ్డారు. ఉపాధ్యాయుని లంచం అడగగా ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎస్ టి ఓ సి హెచ్ మమతను పట్టుకున్నారు.