ఉదయగిరి ఐసిడిఎస్ (అంగన్వాడి) కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంతో బోసిపోయింది. ఇక్కడ పనిచేస్తున్న సిడిపిఓ లావణ్య బదిలీపై కనిగిరి వెళ్లారు. ముగ్గురు సూపర్వైజర్ లు ఉండగా ఒకరిని ఇన్‌ఛార్జ్ సిడిపిఓగా నియమించారు. ఆమె వచ్చే నెల వరకు మెడికల్ లీవ్ పెట్టారు. మరో సూపర్వైజర్ దీర్ఘకాలిక మెడికల్ లీవ్ పెట్టడంతో ఒక్క సూపర్వైజర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు తోడు ఓ కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉన్నారు.