వరికుంటపాడు మండలం భోగ్యంవారి పల్లి గ్రామంలో గురువారం మండల వైద్యాధికారిణి ఆయేషా ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 64 మంది రోగులను పరీక్షించి వారికి ముందు అందజేశారు. గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేక సూచనలు సలహాలు చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.