లార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వరికుంటపాడు పోలీస్ స్టేషన్ లో గురువారం బాలల దినోత్సవం పురస్కరించుకొని ఎస్ఐ రఘునాథ్ గోడపత్రికలను ఆవిష్కరించారు. ప్రస్తుత సమాజంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలికలు, మహిళలపై దాడులు నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు తమవంతుగా ముందుకు వచ్చి కృషి చేయాలని కోరారు. సమాజాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు.