గన్నవరం: మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

50చూసినవారు
గన్నవరం మాల మహానాడు అధ్యక్షుడు సరిహద్దు ఆంథోని ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలను సందర్శిస్తూ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువత భారీ ఎత్తున అంబేద్కర్ ఫోటోలు పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్