దొంగలు నీతులు చెబుతుంటే వినడానికి కష్టంగా ఉంది
దొంగలు నీతులు చెప్తుంటే వినడానికి కష్టంగా ఉందని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ ఇంట్లో ఒక మతం, బయట మరోమతం, ఈ తమాషాలు ఏంటో అర్థం కావడం లేదని విమర్శించారు. హిందూ మత ఆచారాలు, ధర్మాన్ని పాటించని జగన్ వాటితో ఆడుకోవడం మంచిది కాదని హెచ్చరించారు.