గన్నవరం: అభివృద్ధి, సంక్షేమాల వారధిగా రాష్ట్ర బడ్జెట్
అభివృద్ధి, సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన గన్నవరంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు, అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.