చిన్న తరహా పరిశ్రమలకు సాయం అందించాలి

57చూసినవారు
చిన్న తరహా పరిశ్రమలకు సాయం అందించాలి
వరదలతో నష్టపోయిన చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని.. శనివారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. నగరంలో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వరద ఉద్ధృతితో విజయవాడలోని అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రూ. లక్షలు విలువ చేసే యంత్రాలు పాడైపోవడమే కాకుండా అనేక మంది ఉపాధికి దూరమయ్యారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్